రక్తదానం ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది :- బిజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కరణం ప్రహ్లద్ రావు
September 17, 2026
Prajagalam News
మోదీ జన్మదినం సందర్భంగా కుల్కచర్ల రక్తదాన శిబిరం
కుల్కచర్ల,
రక్తదానం ఎంతో గొప్ప సామాజిక సేవ. మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం ప్రహ్లాద్ రావు అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కుల్కచర్ల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం ప్రహ్లాద్ రావు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కరణం ప్రహ్లాద్ రావు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందని, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని కరణం ప్రహ్లాద్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్వాల అంజిలయ్య, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రజక్ పాషా, దిశా అడ్వైజరీ కమిటీ మెంబర్ జానకిరామ్ చౌహన్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె మహిపాల్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ సౌమ్య రెడ్డి, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, మండల నాయకులు కర్ణయ్య, హనుమంతు, లాలూ, ప్రవీణ్, మల్లేష్, మహేష్, వెంకటేష్, సతీష్ తదితరులు ఉన్నారు.