schedule Tuesday, October 27, 2026

గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత కేసీఆర్‌

calendar_today September 18, 2026
person Prajagalam News
గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత కేసీఆర్‌
  తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే గిరిజన సంక్షేమానికి కేసీఆర్‌ హయాంలో ప్రత్యేక ప్రాధాన్యం అని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డీ అన్నారు.బషీరాబాద్ గిరిజన సంక్షేమం, తండాల అభివృద్ధికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మండల పరిధిలో పర్షా నాయక్ తండా,తౌర్యా నాయక్ తండాలలో గురువారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ గతంలో రోడ్డు సౌకర్యం సరిగా లేని తమ ప్రాంతాలకు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి రోడ్లు వేయడం జరిగిందని,ప్రాంత సమస్యలను పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి గిరిజన ప్రాంతాలకు పరిపాలనా గుర్తింపు,అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు, నాయకులు వచ్చినప్పటికీ గిరిజన ప్రాంతాలపై మక్కువ చూపడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్),అల్లాపూర్ (బి) గ్రామ సర్పంచ్ జంగం వీరయ్య,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తౌర్య నాయక్ తండ శివ,అనంతయ్య అల్లపూర్ శివ,రంగా రెడ్డి,మునిందర్ రెడ్డి, మాధవ రెడ్డి,వెంకట్ రెడ్డి,తాహెర్ బాండ్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.