పీఏసీఎస్ డైరెక్టర్ కు ఘన సన్మానం,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్,గ్రామ పెద్దలు,యువకులకు అభినందనలు
September 23, 2026
Prajagalam News
కు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవాంద్గి పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైన కొనిగేరి నరసింహులును జీవన్గి గ్రామంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి. మాధవరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాణిక్ రెడ్డి, సంగారెడ్డి, వెంకటరెడ్డి,భీమిరెడ్డి,వెంకటరెడ్డి,నాగిరెడ్డి, చంద్రశేఖర్, నాగయ్య, అనంతప్ప,జగదీష్, నర్సిములు, బాలకృష్ణ,నర్సింలు, గోపాల్ రాజు, మహిపాల్, నారాయణ,వీరేశం, నజీర్,బాలప్ప, మొగులప్ప,గ్రామ పెద్దలు,యువకులు నరసింహులును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ తనను పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఎంపిక చేసినందుకు గ్రామ పెద్దలు, యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జీవన్గి గ్రామం నుంచి పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డికి, సహకరించిన గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.పీఏసీఎస్ ద్వారా రైతులకు అందుబాటులో ఉండేలా పనిచేస్తానని పేర్కొన్నారు.