schedule Tuesday, October 27, 2026

గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం:- పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి

calendar_today September 23, 2026
person Prajagalam News
గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం:- పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి
కుల్కచర్ల:- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మండలంలో చేపట్టిన, చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.అనంతరం కుల్కచర్ల మండల సోషల్ మీడియా కన్వీనర్ కొమ్ము శ్రీనివాస్ ఎమ్మెల్యే టిఆర్ఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ బోలుసని భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, సర్పంచులు మోర సత్యమ్మ వెంకటేష్,బక్కని వెంకటయ్య,,వార్డు సభ్యుడు కర్రె.వినోద్ కుమార్, మొగులయ్య,నక్క.నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.