రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి:- కుల్కచర్ల ఏఈఓ భావన
September 24, 2026
Prajagalam News
సెప్టెంబర్ 30 చివరితేదీ
కుల్కచర్ల:-
రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కుల్కచర్ల ఏఈఓ భావన అన్నారు. గురువారం కుల్కచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ కార్యలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ గురించి రైతులకు అవగాహనా కల్పించారు.
ఈ సందర్భంగా ఏఈఓ భావన మాట్లాడుతూ.... రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కొత్తగా పట్టా అయిన వారు కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలిపారు. ఇప్పటికే రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోని వారికి యూరియా బుక్ అవ్వట్లేదని. భవిష్యత్తులో వరి, పత్తి, కంది పంటలను మద్దతు ధరకు అమ్ముకోలేరని భవిష్యత్తులో బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడానికి కూడా ఈ ఫార్మర్ ఐడి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మరియు సబ్సిడీలు ఇతర వ్యవసాయ సంబంధిత సేవలకు ఫార్మర్ ఐడి తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్ల నర్సిములు గౌడ్,రైతులు తదితరులు పాల్గొన్నారు.