తడి పొడి చెత్త వేర్వేరుగా అందించాలి. :- లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్
September 24, 2026
Prajagalam News
కుల్కచర్ల
తడి,పొడి చెత్త వేర్వేరుగా చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా సహకరించాలని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో తడి పోడి చెత్తపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రోడ్ల మీద చెత్త వేస్తే అందరికీ ఇబ్బంది ఉంటుందని ఆయన అన్నారు.ఇంటిని శుభ్రంగా ఉంచినట్లే, రోడ్లపై చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచాలని, లేనిచో డెంగీ,విష జ్వరాలు సోకుతాయన్నారు. కోరారు.ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసి సహకరించాలని కోరారు.ప్రజలు సహకరిస్తే చెత్త దూరం చేయడం సులభమని మీరంతా సహకరిస్తే చెత్త రహిత గ్రామంగా మారుద్దామని తెలిపారు. పొడి చెత్త తడి చెత్త ప్రతి రోజూ సేకరిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వరుణ్ కుమార్, వార్డు సభ్యురాలు చంప్లి బాయి,తాండావాసులు మధ్యాహ్నాయక్, మోతిలాల్ నాయక్, చిట్యా నాయక్, మన్యా నాయక్, మేగ్లీ బాయ్, తదితరులు, తాండవాసులు పాల్గొన్నారు.