5వ వార్డు కొత్రేపల్లి ల్లో ఘనంగా వినాయకుని నిమర్జనం
September 25, 2026
Prajagalam News
వినాయకుని మహాప్రసాదాన్ని రూ.81101 కైవసం చేసుకున్న బక్క శ్రీకాంత్
- Vikarabad-:మహా గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు బక్క యాదగిరి అన్నారు.వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కోత్రేపల్లిలో వినాయకుల నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.వినాయక నిమార్జనం కార్యక్రమంలో వార్డుల్లో ప్రజలు, యువకులు మహిళలు, నాయకులు అందరూ కలిసి వినాయకుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం లడ్డు వేలం పాట నిర్వహించగా బక్కాస్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బక్కా శ్రీకాంత్ రూ.81101/- వేలంలో దక్కించుకున్నారు.మరో చిన్న లడ్డును బక్కా నర్సిములు రూ.17100/-,బక్కా యాదయ్య చిన్న లడ్డు రూ. 9001/, బక్క గిరి పండ్లును 12001 దక్కించుకున్నారు.దేవుని వద్ద పూజలు అందుకున్న కలశం ను మల్లారెడ్డి రూ. 3501 సొంతం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎండి ఇక్బాల్, బక్క కాశయ్య,కాలనీ వాసులు శ్యామ్ రెడ్డి,మహేందర్ రెడ్డి, జహంగీర్, బక్క యాదయ్య, చందు, గణేష్, మరియు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సబ్యులు మధు, తేజ కుమార్, అవినాష్ (నాని),వంశీ,సన్నీ, శేఖర్,ఉదయ్ వార్డు ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.