schedule Tuesday, October 27, 2026

కుల్కచర్లలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు 

calendar_today September 26, 2026
person Prajagalam News
కుల్కచర్లలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు 
  కుల్కచర్ల:-   తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికీ, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ బొలుసని భీంరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేరి రాంరెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు,స్థానిక సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య,కాంగ్రెస్ పార్టీ పరిగి తాలూకా బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలో జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్,మండల అధ్యక్షుడు టి.రాములు,రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పలువురు మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ అనేక భూ పోరాటాలు చేసినట్లు తెలిపారు. పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అని ఆమె సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది బాల ముకుందం,మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య,దళిత సంఘాల కన్వీనర్ తుప్పలి అశోక్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్,జిల్లా నాయకులు ప్రేమ్ ప్రకాష్ రెడ్డి,మాలె కృష్ణయ్య గౌడ్ చెలిమిల్ల చంద్రలింగం గాదె.మహిపాల్,రాంపూర్ సర్పంచి తిరుపతయ్,డైరెక్టర్లు భరత్ రెడ్డి,నాగని ఎల్లయ్య,సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మ శ్రీనివాస్, రజక సంఘం నాయకులు లక్ష్మయ్య, కృష్ణయ్య,వెంకటయ్య హన్మంత్ గోపాల్ భీమయ్య చిన్న బాలయ్య బాలు తిరుపతి వెంకటేష్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.