దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి:-కాంగ్రెస్ పార్టీ పరిగి నియోజకవర్గం బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె.భరత్ కుమార్
September 27, 2026
Prajagalam News
*కుస్మసముద్రం శ్రీశ్రీశ్రీ మైసమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత
దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ పరిగి నియోజకవర్గం బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె.భరత్ కుమార్ అన్నారు. ఆదివారం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని కుస్మ సముద్రం గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి కర్రె.భరత్ కుమార్ తన వంతు విరాళంగా 10 వేల రూపాయలను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ తుప్పలి వెంకటేశం,దళిత సంఘాల కన్వీనర్ తుప్పలి అశోక్ కుమార్,పుర్ర చెన్నయ్య, గజ్జి రాములు,గజ్జి లక్ష్మయ్య,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్,నాగని ఎల్లయ్య,నాగని వెంకట్రాములు, కాముని పల్లి వెంకటయ్య గారు, సాలేటి రవికుమార్, బైండ్ల రామచంద్రయ్య, శివాని ఎల్లయ్య,జట్టిగల వెంకటయ్య,నాగని బిచ్చయ్య,గజ్జి భాస్కర్,పుర్ర బాబు,దుల్లకాడి మొగులయ్య,గజ్జి సురేష్,రామయ్య, కిష్టయ్య,ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.