schedule Tuesday, October 27, 2026

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జీవన్గీ సర్పంచ్ రామాని బసప్ప

calendar_today October 1, 2026
person Prajagalam News
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జీవన్గీ సర్పంచ్ రామాని బసప్ప
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో జీవన్గీ గ్రామ సర్పంచ్ రామాని బసప్ప తన అనుచరులతో కలిసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జీవన్గి గ్రామంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామాని బసప్ప మాట్లాడుతూ.. కేవలం తన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి సహకారంతో జీవన్గి రూపురేఖలు మారుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి కోసం 'నేను సైతం' అంటూ కాంగ్రెస్‌లో చేరడం అభినందనీయం" అని పేర్కొన్నారు. మండలానికే 400వందల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. 45 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి కావలసిన సీసీ రోడ్లు,సైడ్ డ్రైనేజీలు,విద్యుత్ స్తంభాలను తక్షణమే మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, జీవన్గి సర్పంచ్ రామాని బసప్ప, పిఎసిఎస్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,ఏఎంసి వైస్ చైర్మన్ శంకరప్ప, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ చందర్ నాయక్, సర్పంచులు నరేష్, జేవీర్ లాల్,వసంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.