జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాలు తక్షణమే పరిష్కారించాలి:-టియూడబ్లుజే(ఐజేయూ) కుల్కచర్ల మండల నాయకులు
October 2, 2026
Prajagalam News
కుల్కచర్ల:- జర్నలిస్టులకు భద్రత, సంక్షేమం కల్పించడంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జాతీయ కార్యవర్గ సభ్యుడు టి. శివ కుమార్ గౌడ్,కుల్కచర్ల మండల అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి కలకొండ.చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజే (ఐజెయు) కుల్కచర్ల మండల అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి కలకొండ.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని, అయినా తమకు సంబంధించిన సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గణేష్, విజయ్ కుమార్,రమేష్, వినోద్ కుమార్, నర్సిములు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.