schedule Tuesday, October 27, 2026

అనంతగిరి బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి

calendar_today October 3, 2026
person Prajagalam News
అనంతగిరి బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి
 

- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలి

- మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏ చంద్రప్రియ

  • వికారాబాద్ -: వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ ఏ చంద్రప్రియ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందడం, పలువురు గాయపడటం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించాలని అన్నారు. వికారాబాద్‌లో ప్రజల భద్రత, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అత్యవసర సమయంలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.