schedule Tuesday, October 27, 2026

బస్ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ఆదుకోవాలి

calendar_today October 3, 2026
person Prajagalam News
బస్ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ఆదుకోవాలి

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సి. అంజిరెడ్డి

  • వికారాబాద్ -: అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సి. అంజిరెడ్డి అన్నారు.శనివారం అనంతగిరి ఘాట్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఈషా హాస్పిటల్, మేడిక్యూర్ హాస్పిటల్‌తో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సి. అంజిరెడ్డి ఆసుపత్రులకు వెళ్లి గాయపడిన బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్, బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు తదితరులు పాల్గొన్నారు.