ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.. అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మిట్టకోడూర్ గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు. వికారాబాద్ జిల్లా డీఎల్ఎస్ఏ సెక్రటరీ ఏ.రాధిక
October 6, 2026
Prajagalam News
పరిగి :-
సైబర్ క్రైమ్, పోక్సో, లేబర్ చట్టాల చట్టాల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సేవా సంస్థ (డి ఎల్ ఎస్ ఏ) కార్యదర్శి ఏ. రాధిక అన్నారు.మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు గ్రామంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు, విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సుకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు... ప్రతి చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా బాలికల తల్లిదండ్రులు, బాలికలు పోక్సో చట్టంపై తెలుసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థినికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించాలని సూచించారు. బాల్య వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ వలలో పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని సెల్ ఫోను అవసరాన్ని బట్టి మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపారు. పిల్లలు ఏడుస్తున్నారని నెపంతో సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల వాళ్లు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులు గమనించలేకపోతున్నారు తద్వారా పిల్లలు సబర్ క్రైమ్ వలలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రతి తల్లిదండ్రి పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలని సూచించారు. సెల్ఫోన్ కు వచ్చిన కాల్స్ ద్వారా గాని మెసేజ్ ద్వారా గాని ఓటిపిలు చెప్పడం కానీ లింకులు ఓపెన్ చేయడం గాని చేస్తే సైబర్ క్రైమ్ వలన చిక్కుకుంటారని తద్వారా కొన్ని సందర్భాలలో కొన్ని రికవరీ కావచ్చు కొన్ని కేసుల్లో కాకపోవచ్చు అని అన్నారు. అలా సైబర్ క్రైమ్ ద్వారా కూడా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసినప్పుడు గాని మెసేజ్ చేసినప్పుడు గాని వాటిని ఎవరికి షేర్ చేయకుండా లింకులు ఓపెన్ చేయకుండా సైబర్ క్రైమ్ వాళ్ళలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అదేవిధంగా లేబర్ చట్టాలపై కూడా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పని చేసే ప్రదేశంలో ఎనిమిది గంటలకు మించి పని చేయకుండా ఉండాలనేది చట్టం చెబుతుందని తెలిపారు. పనిచేస్తున్నప్పుడు ఇష్టం ఉన్నప్పుడు పనిలో చేర్చుకోవడం ఇష్టం లేనప్పుడు పనిలో నుండి తీసివేయడం అది కూడా చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. చేసిన ప్రతి పనికి వేతనం ఉంటుందని ఆ వేతనం చట్టం తెలిపిన విధంగా చెల్లించడం జరుగుతుందన్నారు అలా చెల్లించని యెడల ప్రతి కార్మికుడు కూడా చట్టరీత్యా ఫిర్యాదు చేసుకునే హక్కు ఉందని ప్రతి కార్మికుడు తెలుసుకోవాలని తెలిపారు. తద్వారా ప్రతి కార్మికుడికి న్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా లేబర్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు పొందాలని సూచించారు. లేబర్ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలను భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయ సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవల సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మిట్టకోడూరు గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అంకిత స్వచ్ఛంద సంస్థను అభినందించారు. ఈ సందర్భంగా ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు అంకిత సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు, మ్యాట్లు, చెప్పులు పంపిణీ చేశారు. గ్రామంలోని భవన నిర్మాణం కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు.
అనంతరం పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ మాట్లాడుతూ.... చట్టాలపై అవగాహన ఉండడం వల్ల క్రైమ్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. ఏదైనా క్షణికావేశంలో చేసే నేరాలు ఎందుకు చేశామా అని తర్వాత బాధపడే కన్నా ముందుగానే చట్టాల పైన అవగాహన ఉంటే చేసే నేరాన్ని చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. చట్టం పైన అవగాహన కలిగినప్పుడు చేసే నేరాన్ని బట్టి శిక్ష ఎలా ఉంటుంది అనే దాని పైన అవగాహన ఉంటుంది కాబట్టి నేరాలు చేయకుండా ఉండడానికి ఉంటుందన్నారు. నేరం చేసిన అనంతరం బాధపడి తప్పు జరిగిందన్న లాభం ఉండదని నేను చేయకముందే చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఉండాలని అందుకు చుట్టాలను చదువుకోవాలని అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇటీవల జరిగిన రెండు సందర్భాలలో ఫోక్సో చట్టం కేసుల పైన విద్యార్థినులకు గ్రామస్తులకు వివరించారు. అదేవిధంగా తరగతి గదిలో ఉపాధ్యాయులు కానీ గ్రామంలో మైనర్ బాలికలపైన ఈవ్ టీజింగ్ జరిగితే మీ దృష్టికి వచ్చిన వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మిట్టకోడూరు సర్పంచ్ మాణిక్యం, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ కుమార్,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వెంకటేష్, నీకు లేడు కౌన్సిల్ శ్రీనివాస్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ ఉస్మాన్ అలీ, హై స్కూల్ హెడ్మాస్టర్ బుద్ధదేవ్, ఉప సర్పంచ్ మల్లేశం, స్కూల్ చైర్మన్ అనిత రాణి, అంకిత ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎమ్మార్సీ శ్రీశైలం, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.