schedule Tuesday, October 27, 2026

బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి.:- కుల్కచర్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం :- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్ రావు 

calendar_today October 7, 2026
person Prajagalam News
బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి.:-     కుల్కచర్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం   :-   బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్ రావు 
 
కుల్కచర్ల   బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్ రావు అన్నారు.మంగళవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కుల్కచర్ల, దోమ మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరణం ప్రహ్లాద్ రావు మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటర్లను కలుసుకుని పార్టీ విధానాలను వివరించడంతో పాటు ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కె. శరత్ కుమార్ రెడ్డి, దిశా కమిటీ సభ్యుడు జానకి రాం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ, దోమ మండల అధ్యక్షుడు బొంగు మల్లేష్, కుల్కచర్ల, దోమ మండలాల ప్రధాన కార్యదర్శులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.