schedule Tuesday, October 27, 2026

నీటి సంరక్షణ ఉపయోగపడే పనులకు అధిక ప్రాధాన్యత:-  చెర్వుముందలి తండా సర్పంచ్ రవీందర్ నాయక్..

calendar_today October 7, 2026
person Prajagalam News
నీటి సంరక్షణ ఉపయోగపడే పనులకు అధిక ప్రాధాన్యత:-      చెర్వుముందలి తండా  సర్పంచ్ రవీందర్ నాయక్..
    కుల్కచర్ల   కుల్కచర్ల మండల పరిధిలోని చెరువు ముందలి తండా (ఏ) గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫార్మ్ పాండ్ పనులను సర్పంచ్ రవీందర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ... గ్రామంలో వ్యవసాయానికి, నీటి సంరక్షణకు ఉపయోగపడే పనులను ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. ఫార్మ్ పాండ్‌ల నిర్మాణంతో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రమౌళి, తండా నాయకులు లోక్య నాయక్, టోప్యా నాయక్, గోపాల్ నాయక్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.