బిజేపి కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉంటా:- బిజేపి రాష్ట్ర నాయకుడు డా.వెన్న ఈశ్వరప్ప
October 8, 2026
Prajagalam News
*బిజెపి కార్యకర్తకు అండగా నిలిచిన డా.వెన్న ఈశ్వరప్ప
కుల్కచర్ల:-
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉంటానని బిజేపి రాష్ట్ర నాయకుడు,సేవారత్న అవార్డు గ్రహిత డా. వెన్న ఈశ్వరప్ప అన్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు బలిజ బసవరాజ్ కుమారుడు బలిజ మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని తక్షణమే స్పందించిన బిజెపి రాష్ట్ర నాయకులు,డాక్టరేట్, సేవారత్న అవార్డు గ్రహిత వెన్న ఈశ్వరప్ప
కార్యకర్త వైద్య ఖర్చుల నిమిత్తం 13వేల రూపాయల ఆర్థిక సాయాన్ని పరిగి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ గడుసు మహిపాల్ చేతుల మీదుగా అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ల్యాగల చిన్న రాములు,ఈడిగి యాదయ్య,బసవరాజ్, ఈడిగి వెంకటయ్య,ఈడిగి వెంకటేష్,మన్నే రమేష్, రంగి శేఖర్,రంగి కేశవులు,చాకలి శ్రీనివాస్ గడుసు అశోక్,గడుసు భరత్,చాకలి శ్రీశైలం ఉన్నారు.
*గున్నె.గణేష్ కుల్కచర్ల మండలం