schedule Saturday, August 01, 2026

లాల్ సింగ్ తండాలో సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్

calendar_today March 26, 2026
person Prajagalam News
లాల్ సింగ్ తండాలో సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్
వికారాబాద్ జిల్లా(పరిగి) : కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో నూతన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు రోడ్ల సౌకర్యం ఉండాలని గుంతలు ఉండడం వలన ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని ఈ యొక్క సమస్యలను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సౌకర్యంతో సిసి రోడ్డును వేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావుడ్య బుజ్జి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్ష్మణ్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు అంబర్ సింగ్ నాయక్, సూరారం సత్యం, శ్రీను ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.