సయోధ్య స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం.:- కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ బొలుసని భీంరెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్
October 9, 2026
Prajagalam News
కుల్కచర్ల:-
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలందించేందుకు సయోధ్య స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని పిఎసిఎస్ చైర్మన్ బొలుసాని భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్ అన్నారు. మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో సర్పంచ్ తిరుపతయ్య ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా సయోధ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 36 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. పేదలకు అండగా నిలుస్తూ, పండుగ వేళ వారి ముఖాల్లో ఆనందం నింపడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తూ నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న సయోధ్య స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు జోగు వెంకటయ్య గౌడ్, సర్పంచులు సంతోష్ నాయక్, మల్లేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంచంద్రయ్య, ఉప సర్పంచ్ శంకర్, స్థానిక నాయకుడు శేఖర్, లబ్ధిదారులు పాల్గొన్నారు