కుల్కచర్లలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ..
October 12, 2026
Prajagalam News
కుల్కచర్ల
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని కపిలగిరిపై శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా సోమవారం గ్రామ నాయకుల ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుంకిరెడ్డి ప్రకాష్ రెడ్డి కుటుంబం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి ఉమా రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన భూమిపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కోతులగుట్టపై ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ఈ కార్యక్రమం నాంది పలికింది. భక్తులు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బొలుసని భీంరెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్, ఏఎంసీ చైర్మన్ బీఎస్ అంజనేయులు, గ్రామ సర్పంచ్ వర్వాళ్ల అంజిలయ్య, సుంకి రెడ్డి నర్సింహారెడ్డి, సుంకి రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పి. గోపాల్, దళిత సంఘాల కన్వీనర్ తుప్పలి అశోక్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ బృంగి హరికృష్ణ, సుంకి రెడ్డి కృష్ణారెడ్డి, సుంకి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, పెట్లొళ్ల సౌమ్య, వెంకట్ రాంరెడ్డి, జోగు వెంకటయ్య, బొలసాని శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అంజిలయ్య గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్, తమ్మలి రాంచంద్రయ్య, చెలిమిళ్ల ఆనందం, నాగని ఎల్లయ్య, శివాని ఎల్లయ్య, కర్రే వినోద్, మోత్కూర్ వెంకటేష్, మోర సత్యమ్మ వెంకటేష్, గంగ్య నాయక్, రవి, లాలు నాయక్, నర్సింహారెడ్డి, బక్కని వెంకటయ్య, తిరుపతయ్య, భరత్ రెడ్డి, నాగని వెంకట్రాములు, బైండ్ల రాంచంద్రయ్య, మడిగా కాడి రాజయ్య, జెట్టిగాళ్ల వెంకటయ్య, దొమ్మ బాబు, నాగని బిచ్చయ్య, నాగని ఆంజనేయులు, ఐలాగారి కృష్ణయ్య, పోతగాళ్ల కృష్ణ, శివాని భీమయ్య, కోస్గి వెంకటయ్య, బాను, గణేష్ తదితరులు పాల్గొన్నారు.