schedule Tuesday, October 27, 2026

పాంబండ శ్రీరామలింగేశ్వర స్వామి మెట్లపై స్లాబ్ నిర్మాణానికి ముందుకొచ్చిన పాశం నిరోషా,నర్సింహారెడ్డి, యాదమ్మ..

calendar_today October 12, 2026
person Prajagalam News
పాంబండ శ్రీరామలింగేశ్వర స్వామి మెట్లపై స్లాబ్ నిర్మాణానికి ముందుకొచ్చిన పాశం నిరోషా,నర్సింహారెడ్డి, యాదమ్మ..
  కుల్కచర్ల వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్లలో కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గం కింది భాగం నుంచి పైభాగం వరకు స్లాబ్ నిర్మాణం చేపట్టేందుకు బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన పాశం నిరోషా, నరసింహారెడ్డి, యాదమ్మ దాతలుగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించేందుకు నిర్ణయించారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెట్ల మార్గంలో సౌకర్యం కల్పించేందుకు స్లాబ్ నిర్మాణం చేపట్టడం సంతోషకరమని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో దేవస్థానంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనయ్య, దేవస్థాన అర్చకులు దశరథం, పాండు శర్మ, కమిటీ సభ్యులు ప్రభాకర్, అంజయ్య, కె. నర్సింలు, దేవస్థాన సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.