schedule Tuesday, October 27, 2026

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ

calendar_today October 13, 2026
person Prajagalam News
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ

  • వికారాబాద్ జిల్లా-:రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు సూచించారు. వికారాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హులైన పట్టభద్రుల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రాధాన్యతతో చేపట్టి, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.