schedule Tuesday, October 27, 2026

త్రాగు నీటి సమస్యపై గ్రామ సర్పంచ్ దృష్టి 

calendar_today October 14, 2026
person Prajagalam News
త్రాగు నీటి సమస్యపై గ్రామ సర్పంచ్ దృష్టి 
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలనీలో త్రాగు నీటి సమస్యపై బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ దృష్టికి కాలనీ వాసులు తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి జయంతి కాలనీలో వీధి మొత్తం తిరిగి త్రాగు నీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధార్థ్,వార్డు సభ్యులు రాము రాథోడ్,మాజీ ఎంపీటీసీ నరేష్ చౌహాన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్నీర్ బై,కె.వీరేశం, కాలనీవాసులు,తదితరులు పాల్గొన్నారు.