జలసిరి,మహిళా భవన నిర్మాణాలు, సీఎసి కేంద్రాల పనులను వేగవంతం చేయాలి :- ముజాహిద్‌పూర్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన అడిషనల్ పీడీ సత్యయ్య.
October 16, 2026
Prajagalam News
కుల్కచర్ల
అభివృద్ధి పనుల అమలులో సమన్వయంతో వ్యవహరించి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు అడిషనల్ పీడీ సత్యయ్య ఆదేశించారు. శుక్రవారం
కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలో చేపడుతున్న జలసిరి, మహిళా భవన నిర్మాణ పనులతో పాటు సిఎసి కేంద్రాల స్థితిగతులను పరిశీలించేందుకు అడిషనల్ పీడీ సత్యయ్య గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎసీ కేంద్రం వద్ద ముగ్గు వేయించే కార్యక్రమం నిర్వహించడంతో పాటు, జలసిరికి సంబంధించిన పనుల పురోగతిపై సమీక్షించారు. ఆయా పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా వేగవంతం చేయాలని గ్రామ సర్పంచ్ దేశ్‌ముఖ్ చంద్రభూపాల్‌రావు, ఎంపిడిఓ రామకృష్ణలకు సూచించారు. ఈ పర్యటనలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్. ఆంజనేయులు, ఏఈ, ఈసీ, ఏపీఎం, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.