ఘనంగా ట్రాన్స్‌ఫార్మర్ ఆయుధ పూజ.
October 16, 2026
Prajagalam News
కుల్కచర్ల
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిదిలోని బండవెల్కిచర్ల గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆయుధ పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడుగు శ్రీనయ్య, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్‌మెన్లు మాధవరెడ్డి, నర్సింలు, గ్రామ కార్యదర్శి వినయ్ కుమార్, ఉపాధ్యాయులు ప్రసాద్, సోలార్ ప్లాంట్ ప్రతినిధి కోవటం వెంకట్రాంరెడ్డి, సబ్‌స్టేషన్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సజావుగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పరస్పర సహకారంతో కార్యక్రమంలో పాల్గొన్నారు.