కుల్కచర్ల మండల కేంద్రంలో జనవాసాల్లోకి జింక- అటవీ శాఖ అధికారులకు అప్పగింత
October 16, 2026
Prajagalam News
కుల్కచర్ల
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్యాటగడ్డ కాలనీలో కుక్కల దాడికి గురైన వన్యప్రాణి జింకను స్థానికులు బూరకొండ సత్యం, శ్రీను, అంజిలయ్య చొరవతో రక్షించారు. వీధి కుక్కల బారి నుంచి జింకను కాపాడిన అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వన్యప్రాణి ప్రాణాలను కాపాడేందుకు సమయస్ఫూర్తితో స్పందించి, జింకను అటవీ శాఖ అధికారి పిర్యా నాయక్ కు అప్పగించిన బూరకొండ సత్యం, శ్రీను, అంజిలయ్యల చర్యను స్థానికులు అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ ఘటన చాటిచెప్పింది.