పట్టపగలే ఇంటిని దోచుకున్న దుండగులు
October 16, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో బద్లాపూర్ గ్రామంలో పట్టపగలే ఇంటిని దోచుకున్న దుండగులు ఎస్.ఐ కె.విఠల్ తెలిపిన వివరాల ప్రకారం కంసాన్ పల్లి కవిత భర్త మైసప్ప శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వెసి పోలనికి వెల్లి సాయంత్రం ఇంటికి వచ్చేలోపు ఇంటి తాళం,బీరువా తాళం ధ్వంసం చేసి రెండు తులాల బంగారు గుండ్లు, కమ్మలు,ముక్కు పుడకలు,నగదు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశారు.వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ కే.విట్టల్ తెలిపారు.