వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట :- కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
October 17, 2026
Prajagalam News
కుల్కచర్ల
వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు. శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ కమిటి కార్యలయ భవనం పనులను పరిశీలించి త్వరితగతిన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి సహకారంతో మార్కెట్ యార్డులో మండల రైతంగానికి మౌళిక వసతుల కోసం అభివృద్ధి పనులు చేపట్టడం, రైతంగాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్ళేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు ఉన్నారు