schedule Tuesday, October 27, 2026

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ అవార్డు – 2026లో ఇప్పాయిపల్లి రామ్ తలైవాకు ప్రథమ బహుమతి

calendar_today October 17, 2026
person Prajagalam News
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ అవార్డు – 2026లో ఇప్పాయిపల్లి రామ్ తలైవాకు ప్రథమ బహుమతి
*ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అవార్డు అందుకున్న షాబాద్ రామ్ తలైవ     హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ అవార్డు – 2026 కార్యక్రమంలో కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన షాబాద్ రామ్ తలైవ ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. యువ ఫిల్మ్ మేకర్ల ప్రతిభను ప్రోత్సహించే ఈ పోటీలో మొదటి బహుమతి సాధించడం పట్ల ఇప్పాయిపల్లి గ్రామస్థులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన యువకుడు ప్రతిష్ఠాత్మక వేదికపై అవార్డు అందుకోవడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా షాబాద్ రామ్ తలైవకు పలువురు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.