schedule Tuesday, October 27, 2026

వైభవంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

calendar_today October 18, 2026
person Prajagalam News
వైభవంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ గ్రామంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో,వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొని మహిళలు, గ్రామస్తులతో కలిసి ఉత్సవాల్లో సందడి చేశారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలంతా ఐకమత్యంతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.దసరా, బతుకమ్మ పండుగలు ప్రజల్లో భక్తిభావాన్ని, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతాయని తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.