భక్తిశ్రద్ధలతో కాళమ్మ తల్లి ఆలయంలో యజ్ఞం, ప్రత్యేక పూజలు
October 18, 2026
Prajagalam News
కుల్కచర్ల
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గ్రామ శివారులోని కొలువైన కాళమ్మ తల్లి ఆలయంలో యజ్ఞ, హోమ, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన వడ్ల రాజశేఖర్ చారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. కాళమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమానికి సహకరించిన భక్తులు, గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.