October 18, 2026
Prajagalam News
దుర్గామాతకు ప్రత్యేక పూజలు
కార్యకర్తకు జన్మదిన శుభాకాంక్షలు..
బషీరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక
బషీరాబాద్ మండలంలో పలువురు నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆత్మీయ కలయిక
బషీరాబాద్ మండలం నీళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త జగదీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మైల్వార్ గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, మధు గౌడ్, సర్పంచులు పాండురంగారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీరయ్య స్వామి, నాయకులు రామకృష్ణ రెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తాహేర్, సంజీవ్, బుల్లెట్ శ్రీకాంత్, వేణు, హనుమంత్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజు నాయక్, యాకంరి తదితరులు పాల్గొన్నారు.