schedule Tuesday, October 27, 2026

ఆలయాలు సంసృతి సంప్రదాయాలకు నిలయాలు:- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

calendar_today October 18, 2026
person Prajagalam News
ఆలయాలు సంసృతి సంప్రదాయాలకు నిలయాలు:- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  ‌పోచమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి    కుల్కచర్ల   ఆలయాలు సంసృతి సంప్రదాయాలకు నిలయాలని, భావి తరాలకు అందించాల్సిన ఉందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన,దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య,పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం ప్రహ్లాద్ రావు, జిల్లా అధ్యక్షులు యు.రమేష్ కుమార్, టెలికం అడ్వైజర్ కమిటీ నెంబర్ వెంకటయ్య గౌడ్ లతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామ పెద్దల సహకారంతో వైభవంగా పోచమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు, గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెన్న ఈశ్వరప్ప, శరత్ కుమార్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్,,మిట్ట పరమేశ్వర్ రెడ్డి, గిరామోని శ్రీనివాస్,మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు సౌమ్య రెడ్డి, దిశా కమిటీ నెంబర్ డాక్టర్ జానకి రామ్, మాజీ మార్కెట్ కమిటీ హరికృష్ణ,జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు చాపలగూడెం సర్పంచ్ స్వప్న గోపాల్,కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, ఉపా సర్పంచ్ తలారి విజయ్,జెమిని సురేష్,గాదె మల్లేష్,బీజ్జరం రాంచంద్రయ్య, మోహన్ నాయక్,కొండా అంజి,పంతుల శివ, శివాని వెంకట్,చంద్రకాంత్,దండు వెంకటయ్య, వివిధ మండలాల మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.