schedule Tuesday, October 27, 2026

calendar_today October 18, 2026
person Prajagalam News
ఎన్టీఆర్ కాలనీలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు   మాజీ కౌన్సిలర్ బాతుల మమత నాగు ఆధ్వర్యంలో సంబరాలు.. పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్   తాండూరు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ బాతుల మమత నాగు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్ పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆటపాటలతో కాలనీలో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. వేడుకలు సంతోషోత్సాహాల మధ్య వైభవంగా కొనసాగాయి.