schedule Saturday, August 01, 2026

కుల్కచర్లలో రేపటి నుండి ఎంపిఎల్ క్రికెట్ సీజన్ 1 పోటీలు :శివాజీ క్రికెట్ క్లబ్

calendar_today March 28, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల):రేపటి నుండి కుల్కచర్ల మండల కేంద్రంలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర దేవాలయం రోడ్డులో ఉన్న రైతు వేదిక కార్యలయం ఎదురుగా ఉన్న మైదానంలో మండల ప్రీమియర్ లీగ్(MPL) క్రికెట్ సీజన్ -1 క్రీడలు ప్రారంభించడం జరుగుతుందని శివాజీ క్రికెట్ క్లబ్ నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు చిన్న గేటు నుంచి 200 మంది క్రీడాకారులతో క్రీడా మైదానం వరకు ర్యాలీతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించ తలపెట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి అతిరథ మహాశయులందరూ ముఖ్య అథితులుగా విచ్చేయుచున్నారని క్రీడాభిమానులు అందరూ హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహకులు కోరారు.