schedule Saturday, May 30, 2026

నాణ్యమైన విద్యకు కేరాఫ్ వైష్ణవి హై స్కూల్

calendar_today March 29, 2026
person Prajagalam News
నాణ్యమైన విద్యకు కేరాఫ్ వైష్ణవి హై స్కూల్
ఘనంగా వైష్ణవి హై స్కూల్‌ వార్షికోత్సవం వికారాబాద్-: విద్యార్థులకు మంచి విద్య అందించడంలో వైష్ణవి హైస్కూల్ ముందుంటుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు.వికారాబాద్ పట్టణంలోని వైష్ణవి హై స్కూల్‌లో 24వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైందని, ఈ దశలోనే మంచి విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. విద్యే విజయానికి మార్గమని, విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి కృషి చేస్తే భవిష్యత్తులో విజయాన్ని సాధించగలరని తెలిపారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని అలరించాయి. అలాగే జబర్దస్త్ టీం సభ్యులు బుల్లెట్ భాస్కర్, నరేష్ తమ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాఠశాల యాజమాన్యం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేసింది.ఈ కార్యక్రమంలో వనపర్తి డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, పాఠశాల చైర్‌పర్సన్ నర్సింహ గౌడ్, వికారాబాద్ ఎంఈఓ బాబుసింగ్, ప్రైవేట్ స్కూల్స్ ట్రాజ్మా స్టేట్ బాడీ మెంబర్ నాగేశ్వర్, వికారాబాద్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేఖర్, వార్డ్ కౌన్సిలర్ అనంతలక్ష్మి, 24వ వార్డ్ కౌన్సిలర్లు రుచితచరణ్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్లుసునీల్, నర్సింహరావు, స్కూల్ అడ్వైజర్ సరిత, ప్రిన్సిపాల్ పద్మ, నాగయ్య, యాస్కీ సునీల్, నర్సిములు ,విద్యార్థులు ఉన్నారు.