భక్తిశ్రద్ధలతో రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ, రుద్ర హోమం
April 1, 2026
Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల): కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రుద్రహోమం, గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరై గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర పాంబండ గిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో మార్మోగింది ఈ కార్యక్రమంలో పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, ఆలయ అర్చకులు పాండు శర్మ, దేవాలయ కమిటీ సభ్యులు, గిరిప్రదక్షిణ నిర్వాహకులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.