schedule Friday, July 31, 2026

సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి

calendar_today April 2, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల):- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కుల్కచర్ల సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య,మండల గౌడ సంఘం అధ్యక్షుడు మాలె కృష్ణయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా కుల్కచర్ల మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శివ కుమార్ గౌడ్, నరేష్ గౌడ్, నర్సింహులు గౌడ్ రాజు గౌడ్ పలు యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు