schedule Wednesday, July 29, 2026

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు .. ఎస్సై శ్రీశైలం యాదవ్

calendar_today April 4, 2026
person Prajagalam News
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు .. ఎస్సై శ్రీశైలం యాదవ్
(బషీరాబాద్) ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని బషీరాబాద్ ఎస్సై శ్రీశైలం యాదవ్ అన్నారు.బషీరాబాద్ మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు రెండు ఇసుక ట్రాక్టర్ లను పట్టుకున్నట్లు ఎస్.ఐ శ్రీశైలం యాదవ్ తెలిపారు.ఎస్.ఐ శ్రీశైలం యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం కాశీంపూర్ గ్రామ శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఎక్కేపల్లి గ్రామం యాలాల్ మండలానికి చెందిన ట్రాక్టర్ నెంబర్లు టిఎస్ 34 హెచ్7063,టిఎస్ 34 ఇ1149 ట్రాక్టర్ ఓనర్లు నరేష్ గౌడ్,రమేష్ పై కేసు నమోదు చేసినట్లు శ్రీశైలం యాదవ్ తెలిపారు.