schedule Saturday, May 30, 2026

బిజెపి ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం

calendar_today April 6, 2026
person Prajagalam News
బిజెపి ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం
(తాండూర్ ) తాండూరు పట్టణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు కరణం ప్రహ్లాద రావు నుంచి అందుకున్నారు. నియామక పత్రాన్ని అందుకున్న నాగారం మల్లేశం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ని కలిశారు.తాండూరు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా సీనియర్ నాయకులు మనోహర్ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ గ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్ కుమార్, బిజెపి కౌన్సిలర్లు అంతారం కిరణ్ కుమార్ శ్రీకాంత్ రెడ్డి పట్టణ కమిటీ సభ్యులు చిదిరి ప్రకాష్ మంతటి రాజు ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ బండారి చాకలి బిచ్చప్ప ప్రభాకర్ గౌడ్ బబ్లు సాయిలు బసవరాజు తదితరులు పాల్గొన్నారు.