schedule Friday, July 31, 2026

సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం :- బొలుసని.భీంరెడ్డి, బిఎస్.ఆంజనేయులు

calendar_today April 6, 2026
person Prajagalam News
సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం :- బొలుసని.భీంరెడ్డి, బిఎస్.ఆంజనేయులు
వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల):-నిరుపేదల సొంత ఇంటి నిర్మాణం కల కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు.సోమవారం కుల్కచర్ల మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారుల గృహప్రవేశం కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.