schedule Friday, July 31, 2026

ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం :-దోమ మండల ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి చందు ముదిరాజ్

calendar_today April 10, 2026
person Prajagalam News
ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం :-దోమ మండల ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి చందు ముదిరాజ్
వికారాబాద్ (దోమ)ముదిరాజ్ హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమ అరెస్టులతో అణిచివేయటం హేయమైన చర్య అని దోమ మండల ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి చందు ముదిరాజ్ అన్నారు. ముదిరాజుల హక్కుల సాధనకై చలో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో దోమ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా చందు మాట్లాడుతూకామారెడ్డి డిక్లరేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి బిసి -డి గ్రూప్ నుంచి బిసి-ఎలోకి చేరుస్తామన్న హామీని ఇవ్వడం జరిగిందని కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు నెరవేర్చలేకపోవడం సిగ్గు చేటన్నారు.కోకాపేటలో ఐదు ఎకరాల భూమి ముదిరాజులకు ఇవ్వాలని,పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని,ముదిరాజులకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలైన చేప పిల్లల పంపిణీ పేరుతో విడుదల చేసిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.