పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం :- కాంగ్రెస్ పార్టీ చౌడాపూర్ మండల అధ్యక్షుడు ఏల్పటి. అశోక్ కుమార్
April 12, 2026
Prajagalam News
(చౌడాపూర్) పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల్పటి ఆశోక్ కుమార్, వీరాపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి అన్నారు.చౌడాపూర్ మండలం వీరాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమంలో చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల్పటి ఆశోక్ కుమార్, వీరాపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్బంగా లబ్ధిదారురాలు సొంత ఇంటి కళ నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వెంకట్రాములు,వీరాపూర్ మాజీ సర్పంచ్ అనంతరెడ్డి,చాకల్ పల్లి మాజీ సర్పంచ్ శేఖర్,మండల సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి,వార్డు సభ్యులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు