అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం :- పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి
April 14, 2026
Prajagalam News
(పరిగి):- పరిగి పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ను పరిగి ఎమ్మెల్యే డా టీ రామ్మోహన్ రెడ్డి ఆష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాలపై ప్రజల్లో అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంతో ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. వారి సమయోచిత చర్యల వల్ల అనేక ప్రాణాలు, ఆస్తులు రక్షించబడుతున్నాయని తెలిపారు. ఈ అగ్నిమాపక వారోత్సవాల ద్వారా ప్రజల్లో భద్రతా చర్యలపై అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని సూచించారు ఈ కార్యక్రమం లో అగ్ని మపాక సిబ్బంది కాగ్రేస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.