schedule Saturday, August 01, 2026

గాలివాన బీభత్సం.. కూలిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్

calendar_today April 15, 2026
person Prajagalam News
గాలివాన బీభత్సం.. కూలిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్
(కుల్కచర్ల):-కుల్కచర్ల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ కూలిపోయిన ఘటన కలకలం రేపింది. బలమైన ఈదురు గాలులతో టవర్ ఒక్కసారిగా నేలకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టవర్ కూలిన సమయంలో సమీపంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే టవర్ కూలిపోవడంతో పరిసర ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. టవర్ కూలిపోవడానికి గాలివాన తీవ్రతే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.