schedule Saturday, May 30, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దుర్మర్గమైన చర్య ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప

calendar_today April 18, 2026
person Prajagalam News
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దుర్మర్గమైన చర్య  ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప
వికారాబాద్ జిల్లా (పరిగి/కుల్కచర్ల) పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం ద్వారా జాతికి ద్రోహం జరిగిందని,భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఓ బ్లాక్ డే అని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు మహిళలకు అన్యాయం చేశాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, సుదీర్ఘ కల సాకారం అవుతుందని అందరం భావించామని అన్నారు.పార్లమెంట్, అసెంబ్లీలోనూ 33 శాతం మంది మహిళల్ని ప్రజా ప్రతినిధులుగా చూస్తామని అనుకున్నాన‌ని చెప్పారు. మహిళల్ని గౌరవించటం భారత సంస్కృతిలో భాగం అని, ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారని మన నానుడి అని గుర్తు చేశారు. అయితే నిన్న పార్లమెంటులో దానికి భిన్నంగా జరిగిందని ఆరోపించారు. దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని, హోంమంత్రి హామీ ఇచ్చార‌న్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయన్నారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామని దీనిని అడ్డుకోవటం క్షమించరాని నేరం అని పేర్కొన్నారు