schedule Saturday, May 30, 2026

సిలిండర్లు సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలి:- కుల్కచర్ల మండల సర్పంచులు

calendar_today April 18, 2026
person Prajagalam News
సిలిండర్లు సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలి:- కుల్కచర్ల మండల సర్పంచులు
(కుల్కచర్ల)
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని గ్రామాలకు భారత్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని కుల్కచర్ల మండల సర్పంచులు ఎఎస్ఓ ఆర్.టి నాయక్ ను కోరారు. ఈ సందర్భంగా శనివారం కుల్కచర్ల మండల కేంద్రానికి వచ్చిన ఎఎస్ఓ ఆర్.టి నాయక్ కు వినతిపత్రం అందజేశారు. సక్రమంగా గ్యాస్ సరఫరా లేక పోవడంతో మండల కేంద్రానికి వచ్చి క్యూలైన్లలో నిలబడిన కూడా సిలిండర్లు దొరకడం లేదని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే మండలంలోని గ్రామాలకు గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటి ఆశిష్,మండల సర్పంచులు పాల్గొన్నారు.