schedule Saturday, May 30, 2026

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి. సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్

calendar_today April 22, 2026
person Prajagalam News
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి. సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్
(కుల్కచర్ల) అర్హులైన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.బుధవారం కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ కార్మికులు సమయానికి హాజరై అప్పగించిన పనులను పూర్తిగా నిర్వహించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళలోనే పనులు ముగించాలని సూచించారు అదేవిధంగా ప్రతి కార్మికుడి హాజరు సక్రమంగా నమోదు చేయడం పనులు ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.ఉపాధి కూలీలకు మంచినీటిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శారద, ఆశా వర్కర్ అంజమ్మ, వార్డు సభ్యురాలు శివమ్మ, శాంతి, రాజు, కిషన్, రాంచందర్ తదితరులు తాండ వాసులు పాల్గొన్నారు.