schedule Saturday, May 30, 2026

శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలి :- గోరిగడ్డ తండా సర్పంచ్ అంబికా లాలు నాయక్

calendar_today April 23, 2026
person Prajagalam News
శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలి :- గోరిగడ్డ తండా సర్పంచ్ అంబికా లాలు నాయక్
వికారాబాద్ జిల్లా(కుల్కచర్ల)
గిరిజన రైతులు శాస్త్రవేత్తల సలహాలు,సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని గోరిగడ్డ తండా గ్రామ సర్పంచ్ అంబికా లాలు నాయక్ అన్నారు.గురువారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని గోరిగడ్డ తండా గ్రామపంచాయతీలో కేంద్ర ప్రభుత్వ సంస్థ జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ రాజేంద్రనగర్,కుల్కచర్ల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు సంస్థ నుండి అందించే పథకాలు,భూమి సుపోషణ, సంరక్షణ, కృషి వికాస్ అభ్యాస్, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూసార పరీక్షలు, నేలలో సూక్ష్మ పోషకాలు, సేంద్రియ కర్బనమ్ ప్రాముఖ్యత, అధిక యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలు, సమతుల్య ఎరువుల వాడకంపై మెళకువలు వివరించారు. ఈ సమావేశంలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటేషం,డాక్టర్ శివరామన్, డాక్టర్ సుప్రియ, డాక్టర్ శివ కుమార్, డాక్టర్ ప్రేమ్ చంద్ మీనా,మండల వ్యవసాయ అధికారి వీరాస్వామి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంచందర్ నాయక్,వ్యవసాయ విస్తరణ అధికారి నిఖిత,గ్రామ ఉప సర్పంచ్ శోభ,ప్రజా ప్రతినిధులు, గిరిజన రైతులు పాల్గొన్నారు.