schedule Saturday, May 30, 2026

శ్రీ భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

calendar_today March 20, 2026
person Prajagalam News
- ఉగాది పర్వాది దినాన రథ చక్రాలకు ప్రత్యేక పూజలు - ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిజాతర పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలకు ఉగాది పర్వదినం సందర్భంగా జాతర బ్రహ్మోత్సవాలకు ప్రారంభించడం అనావయితీగా కొనసాగుతుంది. జాతర ఉత్సవాల ప్రారంభోత్సవానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాలయంలో భద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.షడ్రుచులు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ను పచ్చడిగా స్వీకరించి జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే గొప్ప సందేశం ఇచ్చేది ఉగాది పండుగ అన్నారు.ఈ నూతన సంవత్సరంలో చెడు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని ఆకాంక్షించారు.వసంత రుతువు ఆరంభాన చైత్రశుద్ధ పాడ్యమిన వచ్చే ఈ ఉగాది ప్రకృతిలో మార్పు తేవడంతో పాటు మన జీవితాల్లో సైతం కొత్త కాంతులు నింపాలని, ఈ ఏడాది పాడిపంటలు సమృద్ధిగా పండి, సమస్త ప్రజలకు వారి వృత్తిలో అన్ని జయాలే కలగాలని అన్నారు. అనంతరం జాతర ఉత్సవాలకి సంబంధించిన గోడ పత్రికను చైర్పర్సన్ నీరజ, జాతర ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వీరశైవ సమాజ పెద్దలతో కలిసి ఆవిష్కరించారు.జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌, సభ్యుల సమక్షంలో శ్రీ భద్రేశ్వర స్వామి రథచక్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథచక్రాలను రథం నిలిపే చోటుకు తీసుకు వచ్చే సమయంలో భక్తులు భద్రేశ్వర్ కి జై అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవి గౌడ్, నాయకులు డా.సంపత్ కుమార్, జాతర ఉత్సవ కమిటి సభ్యులు గంగా శ్రావణ్ కుమార్, దేవనూరు శంకర్, గాజుల విజయ్ కుమార్, శెట్టి చంద్రకాంత్, మద్రికే చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గనూర్ సంకేత్, వీరశైవ సమాజం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు , యువదళ్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.